Skip to content

Bible Info Telugu

Welcome to Bible Info Telugu

Menu
  • Home
  • About
  • Bible Info
  • Daily Motivation
  • Other Links
    • Disclaimer
    • Privacy Policy
    • Terms and Services
  • Contact Us
  • Sign up
Menu
Parchment - చర్మపు కాగితము

Parchment – చర్మపు కాగితము

Posted on August 29, 2022August 1, 2022 by Bro. Joshua Kiran BTh.,M.Div

పరిశుద్ధ గ్రంథ లేఖనాలు వ్రాయుటకు పపైరస్ ఎంతగా ఉపయోగపడిందో గత సంచికలో తెలుసుకున్నాము. అలాగే పపైరస్ కాగితాల వలె లేఖనాలు వ్రాయుటకు చర్మపు కాగితాలు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఈ చర్మపు కాగితాలనే పార్చ్మెంట్( Parchment – చర్మపు కాగితము ) అని పిలిచేవారు.

పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలో “2తిమోతికి 4:13 నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము అని చర్మపు కాగితాల కోసం అడగటం గమనించవచ్చు”.

ఈ పార్చ్మెంట్ అనేది జంతు చర్మం నుంచి తయారు చేయబడుతుంది. మధ్యయుగ లిఖిత ప్రతులను రాయటం కోసం జంతు చర్మాన్ని ఒక స్వచ్ఛమైన తెల్లని కాగితంగా మార్చడమే పార్చ్మెంట్ అంటారు.

సాధారణంగా వీటికి “పార్చ్మెంట్ ( parchment ) మరియు వెల్లుం(vellum)” అని రెండు పదాలు వాడుకలో ఉన్నాయి.

ఈ పార్చ్మెంట్ అనేది పెర్గామెనమ్ అనే లాటిన్ పదము నుండి తీయబడింది. వెల్లుం అనే పదము “వేల్” లేదా “వేవ్” అనే ఫ్రెంచ్ పదము నుండి వచ్చింది.

Parchment పార్చ్మెంట్ ప్రారంభం :

ఈజిప్ట్ రాజు అయిన ఐదవ ఫరో టోలెమీ పాపైరస్ ల వాణిజ్య నిలిపి వేయసిన సమయంలో అనగా ఇంచు మించు క్రీ.పూ 150 లో పార్చ్మెంట్ ను కింగ్ యుమేనస్ కనుగొన్నట్లు ప్లినీ అనే రోమన్ రచయిత తెలియజేస్తాడు.

ఈ పార్చ్మెంట్ పపైరస్ వలె చుట్టలుగా చేయడం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఇది ఆ పశువు యొక్క పరిమాణం బట్టి తయారు చేయడమే. చూడటానికి చాలా పెద్దగా తయారవుతూ ఉండేది. అది కాక పపైరస్ అతికించినట్లు ఒక కాగితంలో మరో కాగితాన్ని అతికించడం కూడా చాలా కష్టంగా ఉండేది.

అందుకనే క్రీస్తు శకం 50లో చర్మపు కాగితాలను పుస్తకాలుగా తయారు చేయడం మొదలైంది. అప్పటి నుండి కావలసిన పేజీలను ముందుకు వెనకకు తిప్పుకునే వెసులుబాటు కలిగింది.

అందువల్ల ఒక విషయాన్ని ధ్యానించడం మరియు పుస్తక పరిశోధన అనేది చాలా సులువుగా మారిపోయింది. కానీ ఇది పపరైస్ కంటే చాలా ఖర్చుతో కూడుకొనినది. అంతే కాదు చాలా శ్రమతో నిండింది. 

Parchment పార్చ్మెంట్ తయారీ:

ఈ పార్చ్మెంట్ తయారీ అనేది చాలా సమయాన్ని తీసుకునే మరియు కష్టమైన ప్రక్రియ. ముందుగా మంచి జంతు చర్మమును ఎన్నుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. మొదట సేకరించిన చర్మంను చల్లని నీటిలో ఒక పగలు ఒక రాత్రి మొత్తం అది పూర్తిగా శుభ్రం అయ్యేంత వరకు నీటిలో ఉంచి కడగాలి.

అలా చేసినప్పుడు దానిలో ఏమైనా తెగులు ఉంటే అవి సహజంగానే పోతాయి. కానీ కొన్ని ప్రదేశాల్లో మూడు నుండి పది రోజులు వరకు సున్నపు నీళ్ళు ద్రావణంలో చర్మాన్ని కరిగించడం ద్వారా కృత్రిమంగా ఆ వెంట్రుకలను తొలగిస్తారు.

అలా చేయగా వచ్చిన చర్మాన్ని వాటి అన్ని చివర్లలో క్లిప్పుల వంటి వాటితో ఒక చెక్కపట్టీకి కడతారు. తరువాత ఇక్కడ కనిపిస్తున్నట్లు వంకరగా ఉండే ఒక కత్తితో మిగిలిన వెంట్రుకలను తొలగిస్తారు. 

ఇలా మొత్తం వ్యర్ధాలు అన్ని తొలగించబడిన ఆ చర్మాన్ని చివరిగా మరో రెండు రోజులు మంచి నీటితో పూర్తిగా కడుగుతారు. ఇక రెండవ దశలో ఆ చర్మాన్ని ఒక చక్క ఫ్రేమ్ కు క్లిప్పుల వంటి వాటితో చర్మం అన్ని వైపులా ఇక్కడ కనిపిస్తున్నట్లు గట్టిగా బిగిస్తారు.

ఈ చర్మమునకు ఏమైనా రంద్రాలు ఉంటే అవి పార్చ్మెంట్ కు ఏమాత్రం సరిపోదు. అది మంచి చర్మపు కాగితంగా పరిగణలోనికి రావు.

ఓ లోపము లేని ఆ చర్మపు ఉపరితలాన్ని వ్రాయటానికి వీలుగా ఉండుటకు నున్నని రాయితో రుద్దుతారు.

ఈ చర్మాన్ని తేమ నుండి కాపాడగలిగితే పార్చ్మెంట్ చాలా కాలం వాసన లేకుండా ఉంటుంది. ఇలా తయారు చేయబడిన చర్మపు కాగితాన్ని వ్రాయుటకు వినియోగించేవారు.

చూశారు కదా ఇది చర్మపు కాగితాల కోసం క్లుప్త వివరణ మరో అంశంతో మరో సంచికలో కలుద్దాం.

Bro. జాషువా కిరణ్ M.Div.

For Video

Parchment – చర్మపు కాగితము

Post Views: 179
Spread the love
         
 
        

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Essenes: A Brief History – ఎస్సెన్స్
  • Parchment – చర్మపు కాగితము
  • Brief History of Papyrus – పపైరస్ / పెపైరస్
  • Bible Ancient Manuscript -బైబిల్ పురాతన లిపి పద్ధతులు

Categories

  • Bible Info
©2025 Bible Info Telugu | Design: Newspaperly WordPress Theme