ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ విలువైన బైబిల్ గ్రంధం మన వరకు రావటానికి మన పూర్వీకులు ఎంతో కష్టపడ్డారు. వారు దేవుడు తెలియపరచిన మరియు వారు చూచిన, అనుభవించిన విషయాలను గ్రంధస్తం చేయటానికి వారు కొన్ని పద్ధతులను వినియోగించారు. వాటిలో ప్రాముఖ్యమైనది పపైరస్ . ఈ పపైరస్ అనే కాగిత మీద వారు దేవుని మాటల్ని వ్రాస్తూ ఉండేవారు. దాని కోసమే మనం తెలుసుకోబోతున్నాము ఈ A Brief History of Papyrus – పపైరస్ / పెపైరస్ లో
ఈ పపైరస్ క్రీస్తుపూర్వం 4 వేల సంవత్సరాల క్రితం నుండి మనుగడలో ఉంది. ఈ పపైరస్ ఇది మొదట ఈజిప్టులో తయారు చేయబడినప్పటికీ, ప్రాచీన గ్రీస్ మరియు రోమలలో ఉత్పత్తి చేయబడింది.
పపైరస్ మొట్టమొదటిసారిగా పురాతన ఈజిప్టలో ఉపయోగించబడిన దాఖలాలు ఉన్నాయి. ఈ పపైరస్ మొక్క నైలు నది డెల్టా అంతటా సమృద్ధిగా ఉండేది. ఇది మద్యాదర మరియు కూషు సామ్రాజ్యంలో ఎక్కువగా ఉపయోగించబడింది.
ఇది కేవలం రాతపూర్వక రచనల కొరకు మాత్రమే కాకుండా ఇతర రీతులలో కూడా వినియోగములో ఉండేది. దానిని ఉపయోగించి పడవలు, తాళ్ళు, చెప్పులు మరియు వివిధ పనులకు ఉపయోగపడే బుట్టలు వంటి ఇతర కళాకృతుల నిర్మాణంలో కూడా ఉపయోగించేవారు.
ఈ పపైరస్ మొక్క కోసం ఆలోచిస్తే ఇది నీటి ఒడ్డున పెరిగే ఒక రకమైన గడ్డి జాతికి చెందినది. ఈ మొక్క మానవుల చేత విరివిగా వినియోగించబడిన పురాతనమైన చరిత్ర కలిగింది.
ముఖ్యంగా పురాతన ఈజిప్టు వారు దీనిని రకరకాల అవసరాల నిమిత్తం వినియోగించేవారు. మొట్టమొదటిగా పేపర్ తయారు చేయబడటానికి ఇది మూలమని చెప్పుకోవచ్చు.
ఈ పపైరస్ లో కొన్ని భాగాలను తినటానికి వినియోగించేవారు. మనకు తెలిసిన చెరుకు లాగా. నైల్ నది వద్ద అధికంగా దొరికేది. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన స్థలాల్లో పెంచుతున్నారు.
A Brief History of Papyrus – పపైరస్ / పెపైరస్ :
రోమన్ సామ్రాజ్య స్థాపన తరువాత పపైరస్ పై వ్రాయటం ఈజిప్ట్ నుండి యూరోప్ కు వ్యాపించింది. అయితే క్రీస్తు శకము 5వ దశాబ్దంలో రోమన్ సామ్రాజ్యం పతనమైంది. ఈజిప్ట్ కు రోమతో సంబంధాలు తెగిపోయాయి. ఈజిప్ట్ నుండి పపైరస్ దిగుమతి ఆగిపోయింది.
పుస్తక రచన మరియు విజ్ఞాన సాధన వెనుకడుగు వేసాయి. కొన్ని శతాబ్దాలు యూరప్ ఈ కోణములో అంధకారంలోకి జారిపోయింది అంటే అర్థం చేసుకోండి ఈ పపైరస్ ప్రజలను ఎంతగా ప్రభావితం చేసిందో, ఎంతగా ప్రజలలో మమేకమైపోయిందో.
ఈ పపైరస్ చుట్టలు ఒకదానితో ఒకటి అంటించి వాటిని పొడుగుగా తయారు చేసే పద్ధతి రోమన్లు కనిపెట్టారు. ఒక్కో పపైరస్ పుస్తకం 6 లేదా 7 మీటర్ల పొడుగు కూడా ఉండేది.
వాటిపై నిలువుగా 15 నుంచి 30 అక్షరాల నివిడి ఉండేటప్పుడు పొడుగ్గా రాసుకుంటూ పోయేవారు.
పపైరస్ పై ఈజిప్టు ప్రజల నమ్మకాలు:
ఈ మొక్క చాలా పరిశుద్ధమైనదని ఈజిప్ట్ ప్రజలు నమ్ముతారు దానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఈ మొక్క పై భాగంలో చూడడానికి సూర్యుడి నుంచి వచ్చే కిరణాలను పోలి ఉంటుంది.
ఆ పువ్వును “రా” అని పిలిచే వారి సూర్య దేవుని ప్రతిరూపంగా భావిస్తారు. ఇక రెండవ అంశం చూస్తే దాని కాండాన్ని అడ్డుగా కోసినప్పుడు పిరమిడ్ ఆకారంలో ఉంటుంది.
అది శాశ్వత జీవానికి సూచిస్తుంది అని వారు నమ్ముతారు. ఇది ఇంచు మించు 10 నుంచి 15 అడుగులు ఎత్తు పెరుగుతుంది. మరి ఈ మొక్కతో పేపర్ ని ఎలా తయారు చేస్తారు, దాని తయారీ విధానాన్ని కూడా తెలుసుకుందాం.
ప్రాచీన పేపరు తయారీ విధానం :
ఈ పపైరస్ ను అవసరమైన సైజులో కత్తిరించుకున్నాక దాని పైన ఉండే పచ్చని బాగాన్ని తొలగించాలి. ఇది మన చెరుకు వలె పైభాగం దృఢంగాను లోపల భాగం మృదువుగాను ఉంటుంది.
దాని లోపల భాగం కూడా తీయని రుచిని కలిగి ఉంటుంది. అందుకే తీయని రుచి కోసం అప్పట్లో దీని లోపలి భాగాన్ని వినియోగించుకునేవారు.
దీని ఆకుపచ్చని భాగం వంగ్గే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అలాగే దృఢంగాను ఉంటుంది. అందువల్ల చెప్పులు బుట్టలు చేసేవారు. ఇలా పై భాగాన్ని తొలగించాక లోపటి తెల్లని భాగాన్ని సన్నని నిలువ ముక్కలుగా కత్తిరిస్తారు.
ఇలా కత్తిరించిన లోపల భాగములో నీరు ఉండటం వల్ల విరిగిపోయే స్వభావం ఉంటుంది. ఇలా ఉంటే ఇది దేనికి పనిచేయదు.
అందుకే ఆ భాగాలను రోలర్ల సహాయంతో నీటిని తొలగిస్తారు. ఎప్పుడైతే వాటిలో నుండి నీరు తొలగించబడుతుందో ఇవి విరిగిపోవు దృఢంగా ఎలా అయినా వంగే స్వభావాన్ని పొందుకుంటాయి.
అలా చేసిన వాటిని మూడు నుండి 20 రోజులు లేదా 21 రోజులు నీటిలో నానబెడతారు. మూడు నాలుగు రోజులు నానబెడితే తెలుపు రంగులో ఉండే తెల్లటి పేపర్ ను తయారు చేయొచ్చు.
అదే ఆరు రోజులు అయితే గోధుమ రంగులో ఉండే బ్రౌన్ పేపర్ ను తయారు చేయొచ్చు. ఎక్కువ డార్క్ కావాలి అనుకున్నప్పుడు ఎక్కువ రోజులు నాన పెట్టాల్సి ఉంటుంది.
అలా నానబెట్టిన ముక్కలని ఒక కార్పెట్ వంటి దానిపై నిలువుగా ఒక భాగాన్ని, అడ్డంగా ఒక భాగాన్ని ఇక్కడ చూపిస్తున్నట్లు పెడతారు.
పూర్వం జంతు చర్మ లను కార్పెట్ వలె ఉపయోగించేవారు. ఒకదాని మధ్య ఒకటి ఏమాత్రం ఖాళీ సందులు లేకుండా సర్దుకున్న తర్వాత పైన మరో కార్పెట్ ను వేసి అవి అతుక్కోవడానికి వీలుగా ఉంచుతారు.
అలా కత్తిరించిన ముక్కను ఎన్ని రోజులు నీటిలో నానబెడితే సుమారు అన్ని రోజులు ఈ బరువుని వాటిపై ఉంచాలి. ఆ తరువాత బయటకు తీసి ఒక పూర్తి రోజు ఎండలో ఎండబెట్టాలి.
తర్వాత దాని ఉపరితలం వ్రాయటానికి అనుకూలంగా ఉండటం కోసం రాతితో నున్నగా రుద్దుతారు. చెక్క సుత్తితో కొట్టి సరిపడా చదును చేస్తారు. ఇలా పపైరస్ నుండి పేపర్ ను తయారుచేస్తారు.
పూర్వం ఈ ఒకటి నుండి 150 అడుగుల పొడవైన పుస్తకంగా కూడా చేయగలిగే వారు. దీనిని కేవలం ఒక వైపు మాత్రమే వినియోగించేవారు. తర్వాత చుట్టలుగా చుట్టి భద్రపరాస్తారు.
ఆ కాలంలో భక్తులు అంత కష్టపడితే గాని ఈ రోజు బైబిల్ ప్రతులు మన చేతిలోనికి రాలేదు. వారు అనుభవించిన అనేక బాధలకు ఫలితంగా ఈరోజు అనేక బ్రతుకులను మార్చే బైబిల్ మన చేతిలో ఉంది.
దేవునికి మహిమ కలుగును గాక చూశారు కదా బైబిల్ ప్రతులు రాయడానికి వినియోగించిన పపైరస్ కోసం. అలాగే బైబిల్ ప్రతులు వ్రాయుటకు భక్తులు వినియోగించిన మరొక పద్ధతైన ” Parchment – చర్మపు కాగితము ” కోసం వచ్చే సంచికలో చూద్దాం.
Thank You Lord for Teaching us.
Glory to the Lord……..