వేల సంవత్సరాల చరిత్రను, దైవ సందేశాన్ని, భక్తుల జీవిత చరిత్రను, భూత, భవిష్యత్, వర్తమాన కాలన్ని దిశా నిర్దేశలాను తన గర్భములో పొందుపరచుకున్న విలువైన గని బైబిల్. అనేక పుస్తకాల సముదాయం, మెరుగైన గ్రంథాలయం. ఇలాంటి బైబిల్ మన చెత్తులోకి చాలా సులువుగా పొందుకున్నాం. మరి ఈ పరిశుద్ధగ్రంథం యెక్క గ్రంథకర్తలు అంతే సులువుగా లిక్కించగలిగారా? బైబిల్ మన చేతిలోనికి రావడానికి వారు ఊపయోగించిన మాధ్యమ పద్ధతులు ఎంటి? ఈ రోజు మనం తెలుసుకునే విషయం ఇదే, బైబిల్ పురాతన లిపి పద్ధతులు ( Bible Ancient Manuscript )
మానవుడు భూమి పై విస్తరించడం ప్రారంభించిన తరువాత వారి భావాలు ఒకరితో ఒకరు పంచుకోవాల్సిన అవసరం వచ్చింది. మొదట వారు సంజ్ఞలతోనూ, తరువాత బొమ్మలను ఆధారం చేసుకొని వారి ఒక్క భావాలని చెప్పుకొనేవారు. కాల క్రమేణా వారు లిపిని తయారుచేసుకోవడం నేర్చుకున్నారు. అలా వారు చెప్పాలనుకున్న దాన్ని ఆ లిపిని ఊపయోగించి చెప్పటం వారికి వాడుక అయ్యింది. తరువాత కాలంలో వారి జ్ఞాపకాలను భద్ర పర్చుకొనటానికి మనిషి ఎన్నుకున్న వివిధ పద్దతులను మనం తెలుసుకోవడం వల్ల ఆదిమ భక్తులు పరిశుద్ధగ్రంథాన్ని వ్రాయటానికి ఎంత శ్రమించారో మనము అర్థం చేసుకోవచ్చు. వారు దైవలేఖనాలను వ్రాయటానికి వినియోగించిన కొన్ని ముఖ్యమైన పద్దతులు తెలుసుకుందాం.
బైబిల్ పురాతన లిపి పద్ధతులు – ( Bible Ancient Manuscript )
1 . రాతి పలకలు :
మానవుడు మొట్ట మొదట రాతి పలకలపై వారి భావాలను రాయడం మొదలు పెట్టారు. వారు భద్రపరచుకోవాలని అనుకున్నవాటిని వారు రాతి పలకల పై వివిధ పనిముట్లు వినియోగించి వాటి ఆకారాలను,బొమ్మలను చెక్కేవారు. తరువాత వారు లిపిని చెక్కటం ప్రారంభించారు. ఇప్పటికి మన పురావస్తు శాస్త్రవేత్తల త్రవ్వకాలలో ఇలాంటి రాతిపలకలు దొరకుతునే ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో కూడా దేవుడు మోషేకు పది ఆజ్ఞలను రాతి పలకల మీదనే పొందుపరచడం మనం గమనించవచ్చు (నిర్గ 24:12, నిర్గ 34:4).
2 . మట్టి పలకలు :
రాతి పలకలను వినియోగిస్తూనే మట్టిని పలకలుగా చేసి వాటి పై కూడా రాయడం మొదలు పెట్టారు. ఇది రెండు పద్ధతి. ఇలా వ్రాసినటవంటి పలకలను “క్లే టాబ్లెట్స్” అని పిలుస్తారు. ఈ మట్టి పలకలను వారికి కావలసిన ఆకారంలో తయారు చేసుకొని పూర్తిగా ఎండ్డిపొకముందే ప్రత్యేకంగా తయారు చేయబడిన వస్తువుతో దాని పై గుర్తులను అచ్చు వేస్తూ ఉండేవారు. ఈ మట్టి పలకలు రెండు రకాలుగా చేసేవాళ్ళు. ఒకటి వారు ముద్రించిన తరువాత వాటిని కాల్చి భద్రపరిచే వారు. ఎక్కువ కాలం నిల్వ ఉంటుఉండేవి. ఇక రెండువది ముద్రించిన తరవాత కాల్చకుండ అలానే ఆరబెట్టి ఉంచే వాళ్ళు. ఇవి మళ్లీ ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉండేది. ఇలాంటి “క్లే టాబ్లెట్స్” మొత్తం మీద 50 వేలకు పైగా దొరికినట్టుగా శాస్త్రవేత్తల అంచనా.
3 . మైనపు పలకలు :
మూడవది మైనపు పలకల మీద రాయడం దీన్ని “వ్యాక్స్ టాబ్లెట్స్” అని పిలిచేవారు. ఇది ఒక రకమైన పదార్థాల నుండి తయారు చేయబడిన “మైనాన్ని” చెక్కతో తయారు చేసిన పలకలను ఉపయోగించి వీటిని తయారుచేసే వాళ్ళు. కాని ఇది అంత మంచి పద్ధతిగా కనిపించలేదు. ఎందుకంటే వాతావరణం మార్పులకు ఇవి ఎక్కువ కాలం నిలువలేక పోయాయి. దీన్ని ఎక్కువగా రోమన్స్ మరియు గ్రీకులు వాడేవాళ్ళు. అందుకనే దీన్ని “రోమన్స్ స్టైల్ వ్యాక్స్ టాబ్లెట్స్” అని పిలిచేవాళ్ళు.
4 . పెపైరస్:
పెపైరస్ లేదా పేపరస్ అని పిలువ బడేటి వంటి కాగితాల మీద వ్రాసేవారు. పెపైరస్ అనే మొక్క బెరడు నుండి పేపరును తయారు చేసి. దానిని లికించడానికి ఉపయోగించే వాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ పద్ధతి ప్రపంచ చరిత్రలో చెరగని ముద్రను, పెను మార్పులను తీసుకుని వచ్చింది అని చెప్పాలి.అంతే కాదు పరిశుద్ధ గ్రంథం లిక్కించబడానికి ఈ పెపైరస్ అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషించిదని చెప్పుకోవచ్చు. ఇప్పటికి మనం వాడుతున్న పేపరుకు ఇదే మూలం అని ఖచ్చితంగా చెప్పాలి.
5 . జంతు చర్మాలు :
ఇక ఐదవ పద్ధతి పశువులు మరియు జంతు చర్మాల పై రాయటం. ఈ పద్ధతిని “ప్యాచ్ మెంట్ ” అని పిలుస్తారు. ఈ జంతు చర్మాలను రాయుటకు వినియోగపడేటట్లు తయారు చేయడం చాలా ప్రయాసతో కూడి ఉంటుంది. అందులోనే మరో పద్ధతి ఉంటుంది. అది లేత పశువుల చర్మాలతో తయారు చేస్తారు. దీన్ని “వెల్లుం” అని పిలిచేవాళ్ళు. పశువులు చనిపోయినా, లేక చంపబడినా కూడా వాటి చర్మాలను ఈ విధంగా సమాచారాన్ని భద్రపరచటానికి వినియోగించేవారు.
6 . ఇతర పద్ధతులు:
కాలం మారుతున్న కొద్దీ కొత్త కొత్త పద్దతులలో సమాచారాన్ని, రాయటము, భద్రపరచటం మారుతూ వచ్చాయి. ఇత్తడి, ఇనుము రేకులు, వస్త్రాలు, మరి కొన్ని రకాల ఆకుల(పత్రాలు)మీద కూడా వ్రాస్తూ వచ్చారు. భారతదేశంలో ఇప్పటికి ఇత్తడి రేకుల మీద వ్రాయటం మనకు తెలిసినదే. అలాగే ఆకుల మీద వ్రాయబడిన గ్రంధాలు తాళపత్రాల రూపంలో కనిపిస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని ఎక్కువకాలం మన్నేవి కాకపోవటం వలన అవి కాలగర్భములో కలిసిపోయాయి.
పైన చెప్పబడిన వీటన్నిటిలో పరిశుద్ధ గ్రంధ నిర్మాణానికి ఎక్కువగా పెపైరస్ ( Papyrus ) మరియు జంతు చర్మాలపై రాసే పద్దతినే వినియోగించారు. వాటిని తయారు చేసి విధానం క్లూప్తంగా వచ్చే సంచికలో తెలుసుకున్నాం.
Good information
Amen!!
Thank you lord , we learned a lot of scripts in many ways through this post. And before that, we pray to God that we should know good things from you that are deeper.
Glory to the God🙏
Glory to God